AP TET Results 2025 Download AP TET October 2025 Results at aptet.apcfss.in APTET 2025 Result Rank Card Score Sheet How to download APTET 2025 Results Certificate aptet Results aptet Results download 2025 AP TET Results 2025 Paper 1 & 2 AP TET 2025 1A, 1B, 2A, 2B Result Download AP Teacher Eligibility Test 2025 Results released The Same notice also displayed in APTET Official Website.
Andhra Pradesh Teacher Eligibility Test (AP TET) Results released. You can enter the candidate ID, date of birth, verification code and get the results.
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు (AP TET Results) విడుదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య ఎ.పి.టెట్- అక్టోబర్-2025 పరీక్షా ఫలితాల విడుదల.
తేదీ : 09-01-2026 సమయం సాయంత్రం 05:30 లకు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2025 పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన ఏపీ టెట్ అక్టోబర్ 2025 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. గత డిసెంబరు నెల 10వ తేదీ నుండి 21వ తేదీ వరకు పదిరోజుల పాటు జరిగిన ఈ ఉపాద్యాయ అర్హత పరీక్షలకు 2,71,692 మంది దరఖాస్తు చేసుకోగా 2,48,427 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించి ముందుగా ప్రాధమిక కీ విడుదల చేశారు. అభ్యర్ధుల నుండి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తరువాత తుది ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ పరీక్షలలో 39.27% మంది అనగా 97560 మంది అభ్యర్థులు ఉతీర్ణులయ్యారు. అదే విధంగా, ఈ పరీక్షలకు 31,886 మంది ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు హాజరుకాగా, వారిలో 47.82 శాతం, అనగా 15,239 మంది ఉపాధ్యాయులు ఉత్తీర్ణులయ్యారు. అభ్యర్ధులు తమ కాండేట్ లాగిన్ తో ఏపీ టెట్ అధికారిక వెబ్సైట్లో (https://tet2dsc.apcfss.in లేదా http://cse.ap.gov.in ) లాగిన్ అయ్యి ఏపీ టెట్ -2025 పరీక్షా ఫలితాలను తెలుసుకోవచ్చు, టెట్ పరీక్షా ఫలితాలను 9552300009 వాట్స్ అప్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అని ఏపీటెట్ కన్వీనర్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.
క్యాండిడేట్ ఐడీ, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చు.